ముత్యంపల్లి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
*ప్రజా గొంతుక న్యూస్ : కాసిపేట్
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రముఖ్య శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటాని పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించి పలు సైన్స్ ప్రాజెక్ట్ లను ప్రదర్శించారు. విద్యార్థులకు సైన్స్ గొప్పతనాన్ని వివరించారు. అనంతరం ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టిని సారించాలని సూచించారు. సమాజంలో వస్తున్న ఆధునిక , సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడూ విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని, మూఢ నమ్మకాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. 1928లో భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్నిజరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ సంబందిత అంశాల పై పోటీలను నిర్వహించి బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పుష్పలత, బండ శాంకరి, పల్లె కృష్ణ గోపాల్ రావు, చంద్ర శేఖర్ రెడ్డి, తిరుపతి, మాధవి లత, విద్యార్థులు పాల్గొన్నారు.












