విద్యార్థులందరూ కూడా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండలి...జిల్లా విద్యాధికారి జి శారద.
ప్రజా గొంతుక (ఫిబ్రవరి 28 )కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని పెగడపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులు ఏర్పాటుచేసిన విజ్ఞాన శాస్త్ర పరికరాల మేళా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా విద్యాధికారిని శ్రీమతి జి శారద, మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడాతు,ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పధం కలిగి ఉండాలని, నోబెల్ బహుమతి పొందిన డాక్టర్ సి.వి.రామన్ లాగా పేరు తెచ్చుకోవాలని విద్యార్థిని విద్యార్థులకుసూచించారు. పాఠశాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఉపాధ్యాయులు విద్యార్థులు అన్ని పోటీ పరీక్షల్లో ప్రతిభ ప్రదర్శిస్తూ ఆ స్థానాన్ని నిలబెడుతూ వస్తున్నారని అన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు వందలకు పైగా పరదర్శనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర చారి ,విజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు కే. కోటేశ్వర్ రావు, కోటి రెడ్ది, జయప్రకాశ్ ను జిల్లా అధికారి అభినందించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ అరెల్లి రమేష్,మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఉపసర్పంచ్ పత్తి శ్రీనివాస్ రెడ్ది, వార్డుసభ్యులు,సదయ్య,తదితరులు పాల్గొన్నారు.












