గంజాయి పై కన్నెర్ర చేసిన నల్లగొండ టూ టౌన్ పోలీస్......
పొరగాండ్లు మత్తు వ్యసనాలకు బానిసై దొంగతనాలు షురూ చేసిండ్రు..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:27
హైదరాబాద్ నుంచి గంజాయి తెచ్చుకుని నల్లగొండ పట్టణంలో చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్ముతూ, మత్తుకు బానిసై బైక్ దొంగతనాలు కూడా మొదలుపెట్టిన యువకుల గ్యాంగ్‌ను టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు
శివాజీనగర్ చౌరస్తా దగ్గర నమ్మదగిన సమాచారంతో చెక్ చేస్తుండగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు...
A 1 సమద్ (శివాజీ నగర్) మాత్రం బైక్ మీద నుంచి దూకి పరారయ్యాడు.
A-2 గడిదల పవన్ – బీట్ మార్కెట్, A-3 నాగిళ్ల సంపత్ – నర్సింగ్ బట్ల గ్రామం, A-4 పెండ్ర పరశురాం – సుభాష్ చంద్రబోస్ నగర్,A-5 కట్ల వెంకటేశ్వర్లు @ పవన్ – వివేకానంద నగర్, నల్లగొండ వాసులుగా పోలీసులు గుర్తించారు...
వారి దగ్గర నుంచి సుమారు రెండు కిలోల గంజాయి, నాలుగు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు...
విచారణలో గతంలో చేసిన రెండు బైక్ దొంగతనాలు కూడా బయటపడ్డాయని డి.ఎస్.పి శివరామిరెడ్డి తెలిపారు.
మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ ఆపరేషన్ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో, సీఐ ఎస్. రాఘవరావు ఆధ్వర్యంలో ఎస్సై సైదులు సిబ్బంది తో కలిసి నిర్వహించారు...












