ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న వొడ్నాల శివలింగం.
ప్రజా గొంతుక ( ఫిబ్రవరి 27)కాల్వశ్రీరాంపూర్ : మండల కేంద్రానికి చెందిన వొడ్నాల శివలింగంకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగం నుండి డాక్టరేట్ పి,హేచ్.డి పట్టా అందుకున్నారు.శివలింగం “ఏ స్టడీ ఆన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇన్వెస్టర్ ఫైనాన్సియల్ డెసిషన్ మేకింగ్” అనే అంశంపై పరిశోధన నిర్వహించి, తన సిద్ధాంత వ్యాసాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఈ పరిశోధనను వాణిజ్య విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం. గంగాధర్ మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు. సామాజిక మాధ్యమాలు పెట్టుబడిదారుల ఆర్థిక నిర్ణయాలపై చూపుతున్న ప్రభావాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ఈ అధ్యయనం రూపోందిచారు.
అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.కాం పట్టాను ప్రతిభతో పూర్తిచేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు, అనంతరం యూజీసీ నెట్-జేఆర్ఎఫ్ (UGC NET JRF) మరియు తెలంగాణ రాష్ట్ర సెట్ (TG SET)అర్హతలను సాధించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూజీసీ నెట్-జేఆర్ఎఫ్, సెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు “అచీవర్స్ అడ్డా 24/7” అనే తన స్వంత సామాజిక మాధ్యమ వేదిక ద్వారా బోధన అందిస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నారు.ఈ సందర్భంగా తన పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన ప్రొఫెసర్ ఎం. గంగాధర్,వాణిజ్య విభాగంలోని అధ్యాపకులకు, కుటుంబ సభ్యులకు స్నేహితులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.













