హాలియా మున్సిపాలిటీ 1వ వార్డులో తన సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన....... వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:27
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం ఇటీవల హాలియా మున్సిపాలిటీ లో 1 వార్డ్ నుండి ఘన విజయం సాధించిన గౌని రాజా రమేష్ యాదవ్ (వైస్ చైర్మన్), తన సొంత నిధులతో సుమారు 250000/- రూపాయలతో 1 వ వార్డ్ లో సీసీ కెమెరా లు పెట్టించడం జరిగింది
ఈ సీసీ కెమెరాలను నల్గొండ జిల్లా ఎస్పీ , మరియు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి చేతుల మీదగా ఓపెన్ చేయడం జరిగింది రాజా రమేష్ మాట్లాడుతూ ఈ సీసీ కెమెరాలు పెట్టంచడానికి ముఖ్య కారణం దొంగతనాలు జరగకుండా, మరియు మొన్న జరిగినటువంటి మర్డర్ సీసీ కెమెరాలు ఉండబట్టే పోలీస్ సిబ్బంది వాళ్ళు తొరగా పట్టుకోగలిగారు , ఇలాంటి సంఘటనలు పట్ల సీసీ కెమెరాలు చాలా పనికొస్తాయి అని అన్నారు ఈ విషయం పట్ల నల్గొండ ఎస్పీ మరియు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ,మిర్యాలగూడ డి ఎస్పీ,హాలియా సి ఐ , ఎస్ ఐ మరియు పోలీస్ యంత్రాంగం మొత్తం,నాయకులు, మరియువార్డ్ ప్రజలు రాజా రమేష్ కి కృతజ్ఞతలు తెలిపి అభినందించారు












