నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిడమనూరులో కళ్యాణ లక్ష్మి చెక్‌ల పంపిణీ కార్యక్రమం.....
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:27
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిడమనూరు మండలంలోని అర్హులైన ప్రతీ గ్రామ ప్రజలకు చెక్‌లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నిడమనూరు గ్రామ సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం , వార్డు నెంబర్ లు ,ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు












