మోడల్ స్కూల్ విద్యార్థులకు అందిస్తున్న భోజన,ఆరోగ్య వసతులను పరిశీలించిన ఎంపీడీవో.
ప్రజా గుంతక( ఫిబ్రవరి 27 )కాల్వ శ్రీరాంపూర్ : తెలంగాణ మోడల్ స్కూల్,జూనియర్ కాలేజ్ ని సందర్శించిన ఎంపీడీవో రామ్మోహన చారి .కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్, కాలేజ్ని మండల అభివృద్ధి అధికారి కలికోట రామ్మోహన్ చారి సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్ సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వసతి గదులు, త్రాగునీరు, శౌచాలయాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించరు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ప్రిన్సిపాల్ అనుముల పోచయ్య, ఉపాధ్యాయ సిబ్బంది సమన్వయం తో విద్య బోధన విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేస్తున్న,పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని ఎంపీడీవో అభినందించారు.












