*ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలి*
*మెదక్ జిల్లా నూతన కలెక్టర్ ప్రతిమా సింగ్*
*ప్రజాగొంతుక మెదక్ ప్రతినిధి ఫిబ్రవరి 26*
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
నూతన కలెక్టర్ కలెక్టరేట్ కు చేరుకోగానే జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, డి ఆర్ ఓ భుజంగ రావు,మెదక్ ఆర్డీవో రమాదేవి పూలమొక్క అందించి స్వాగతం పలికారు.
గురువారం మెదక్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యత చేపట్టిన కలెక్టర్ కు జిల్లా అధికారులు జిల్లా అధికారులు పూల మొక్కల తో స్వాగతం పలికి మర్యాదగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా నూతన కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నెరవేర్చుతూ ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు.
ఇంటర్, పదో తరగతి పరీక్షల గురించి డీఈఓ ను, ఇంటర్ విద్యార్థి గారిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ ఓ భుజంగరావు, జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.












