ఉలక్ష్యాన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం.....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:26
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం స్థానిక హాలియా
లక్ష్యా ఉన్నత పాఠశాలలో జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమం
అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా
అనుముల మండల విద్యాధికారి శ్రీనయ్య , అనుముల మండల
వైద్యాధికారి రామకృష్ణ హాజరయ్యారు. ఇందులో భాగంగా
ఎం ఈ ఓ మాట్లాడుతూ. విద్యార్థుల యొక్క సైన్స్ ప్రయోగాలు,
వర్కింగ్ నమూనాలు తనకెంతో నచ్చాయని విద్యార్థులను మెచ్చుకు.
న్నారు. ప్రత్యేకంగా అంధులకు ఉపయోగపడే కర్ర, ఆర్టిఫిషియల్. కిడ్నీ,
వ్యవసాయ ప్రయోజక డోన్, కృత్రిమ ఊపిరితిత్తులు తనను (ప్రత్యేకంగా)
ఆకర్షించాయని ఉటంకించారు. వైద్యాధికారి రామకృష్ణ మాట్లా-
డుతూ విద్యార్థులు చేసిన ప్రయోగాలు. ఇచ్చిన వివరణ తనకు నచ్చాయని.
విద్యార్థులకు కొన్ని ఆరోగ్య సూత్రాలు, లాభాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్
రెడ్డి, పాఠశాల డైరెక్టర్లు నాగెండ్ల విజయ భాస్కర్ రెడ్డి, సర్వనేని సతీష్.
పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,
తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.












