భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కొత్త సారథి.. 2019 బ్యాచ్ అంకిత్ IAS నియామకం
ప్రజా గొంతుక న్యూస్, ఫిబ్రవరి 26/కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కొత్త సారథి వచ్చారు. జిల్లా నూతన కలెక్టర్గా 2019 బ్యాచ్ IAS అధికారి అంకిత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా సేవలందించిన అంకిత్, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో B.Tech పూర్తి చేసిన అంకిత్ (జననం: 02 అక్టోబర్ 1991) యువ, డైనమిక్ అధికారిగా ప్రజల మధ్య మంచి పేరు తెచ్చుకున్నారు. నిజామాబాద్లో విద్య, ఆరోగ్యం, స్థానిక సంస్థల అభివృద్ధి వంటి రంగాల్లో కీలక పాత్ర పోషించారు.
ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన జితేష్ వి పాటిల్ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (TGSPDCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది.
. త్వరలోనే అంకిత్ కొత్తగూడెంలో బాధ్యతలు చేపట్టనున్నారు.













