E-PAPER

రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ.

Date : 25 February 2026, 3:09 pm Posted By : PRAJA GONTHUKA

రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ.

రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ.

ప్రజా గొంతుక చేర్యాల : పట్టణ కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసిన ఘటన విదితమే. ఆ దాడిలో రెండు నెలల పసిపాప చావుకు కారణమైన అగ్ర వర్ణాల వారిని అరెస్టు చేయాలని అన్నారు.ఈ సందర్బంగా రజక సంఘం అధ్యక్షుడు శివగారి అంజయ్య మాట్లాడుతూ టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారనే సాకుతో రజక (చాకలి) కులస్థులు అయిన గణేష్, చంద్రకళ,మౌనికల పై గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి నాయకత్వంలో సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మధు రెడ్డి మొదలగు అగ్రకుల దురహంకారంతో భయంకరంగా దాడి చేసి కొట్టారనీ, రెండు నెలల పసిపాపను కాలుతో తొక్కి చంపాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులపై మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచి తగురక్షణను, నష్టపరిహారాన్ని అందించాలనీ, హంతకులను శిక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట బహుజనులపై అగ్రకులాల దాడులు, హత్యలు జరుగుతున్నాయన్నారు.

గ్రామాలలో, బస్తీలో కుల వివక్షత అమలు జరుగుతుంది, కులదురహంకారం, కులతత్వ నీచ సంస్కృతి పధకం ప్రకారం పెంచి పోషించబడుతుందాని చెప్పారు.వాటి వాళ్ళ దాడులు పెరుగుతున్నాయనీ, వీటిని అరికట్టడానికి తక్షణమే దళిత బహుజన ప్రజాస్వామిక శక్తులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి తగు చర్యలు చేపట్టాలన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు పంచడానికి అవసరమైన ప్రత్యేక చట్టం తీసుకురావాలనీ సూచించారు. చనిపోయిన చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం కులస్తులు తుమ్మలపల్లి శీను,రాచకొండ శ్రీనివాస్,ఎర్రోళ్ల పరశురాములు,బసవరాజ్ యాదగిరి, శనిగారి యాదగిరి, తుమ్మలపల్లి సంజీవులు, తుమ్మలపల్లి కనకయ్య,శనిగారి రాజు, పెద్దిగారి రమేష్,శివగారి శ్రీకాంత్,తుమ్మలపల్లి కిరణ్,శని గారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్