మల్లన్న దర్శించుకున్న పాట్నా హైకోర్టు న్యాయవాది.
ప్రజా గొంతుక కొమురవెల్లి : ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని పాట్నా హైకోర్టు న్యాయవాది అనుపమ చక్రవర్తి మల్లన్న దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. శేష వస్త్రం, స్వామి వారి చిత్రపటం, ప్రసాదమును అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, పర్యవేక్షకుడు చంద్రశేఖర్, ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, ఉప ప్రధాన అర్చకుడు సాంబయ్య, ముఖ్య అర్చకులు ఆంజనేయులు, మనోహర్, బసవేశ్వర్, జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు. అనుపమ చక్రవర్తి వెంట చేర్యాల కోర్టు సూపరిండెంట్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.












