*ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు*
*భక్తిశ్రద్ధలతో మహిళల ప్రత్యేక పూజలు*
*ప్రజాగొంతుక పాపన్నపేట( ఫిబ్రవరి 24)*
పాపన్నపేట
మండల కేంద్రంలోని పాపన్నపేటలో మంగళవారం నాడు గౌడ కులస్తులు రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం తయారు చేసి సమర్పించారు. సాయంకాలం
గ్రామంలోని దుర్గామాతను ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. గ్రామంలోని మహిళలు తలపై బోనాలను పెట్టుకొని పురవీధుల్లో డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి బోనాలు సమర్పించి ప్రత్యక పూజలు చేశారు. తమ కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుతూ చల్లగా దీవించమ్మ అంటూ ఎల్లమ్మ తల్లిని వేడుకుంటూ బోనాలు రేణుక ఎల్లమ్మ తల్లి గుడి వద్దకు మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో బయలుదేరి వెళ్లారు అమ్మవారికి సమర్పించార.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కులస్తులు సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ .సత్య గౌడ్ ప్రవీణ్ గౌడ్ .గురుమూర్తి గౌడ్ ప్రసాద్ గౌడ్. భూమాగౌడ్. గౌడయవజన సంఘ సభ్యులు పెద్ద ఎత్తున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు.












