చేర్యాల నూతన ఎస్సైని కలిసిన సీపీఐ నాయకులు.
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ రెడ్డిని సీపీఐ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. పార్టీలకతీతంగా న్యాయబద్ధంగా పనిచేయాలని ఎస్ఐ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్, జిల్లా నాయకులు ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, వలబోజు నర్సింహా చారి, గూడెపు సుదర్శన్, పొన్నబోయిన మమత, సుంకోజు రజిత, గూడెపు సంతోష, ఈరి సత్తవ్వ, బింగి పోషయ్య, తదితరులు పాల్గొన్నారు.












