*ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి ని కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 24 ఫిబ్రవరి 2026.
తేదీ 24 ఫిబ్రవరి 2026 రోజున నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు
ఈ సందర్భంగా నర్సంపేట ఏసీపీ తో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం రమేష్ , చెన్నారావుపేట మండల అధ్యక్షులు మంద నరేష్ , ప్రధాన కార్యదర్శి నూనె తిలక్ , ఉపాధ్యక్షురాలు అల్వాల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.












