తాత్కాలిక మరమ్మతులు వద్దు
అడ్డుకున్న ఫైట్ ఫర్ బచ్చన్నపేట టీం..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
నిన్నటి రోజు బచ్చన్నపేట చౌరస్తాలో దాదాపు నాలుగు గంటలు రోడ్డు కోసం ఫైట్ ఫర్ బచ్చన్నపేట టీం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా 15 రోజులలో రోడ్డు ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడంతో ధర్నా విరమించారు. నేడు జెసిబి లారీ తో కంకర డస్ట్ తీసుకువచ్చి గుంతలను మరమ్మత్తు చేయడంతో ఫైట్ ఫర్ బచ్చన్నపేట టీం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు మూడు కిలోమీటర్లు నూతన రోడ్డు నిర్మించాలని ధర్నా చేశాము కానీ ఈ తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందామని కాంట్రాక్టర్ చూస్తున్నాడని తాత్కాలిక మరమ్మత్తు ప్రజలకు అవసరం లేదని హెచ్చరించారు. అక్కడ ఏర్పడ్డ గుంతలలో డస్ట్ కంకర వెయ్యడం వల్ల వాహనాలు వెళ్లినప్పుడు మరింత దుమ్ము ధూళి వచ్చి సమస్య మరింత ఎక్కువనే అవుతుందని , కంకర మీది నుండి వాహనాలు వెళ్లినప్పుడు ఆ కంకర స్లిప్పై ఎగిరి ప్రజలకు ప్రమాదం జరిగి తలలు పగిలే అవకాశం ఉందని, ఇలాంటి తాత్కాలిక మరమ్మతులు అవసరం లేదని, 15 రోజులలో రోడ్డు ఏర్పాటు చేయకుంటే మరింత ఉధృతంగా ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.














