E-PAPER

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి – సురక్షితంగా ఇల్లు చేరాలి..

Date : 23 February 2026, 9:10 pm Posted By : PRAJA GONTHUKA

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి – సురక్షితంగా ఇల్లు చేరాలి..

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి – సురక్షితంగా ఇల్లు చేరాలి..

ఎస్సై దివ్య..

ప్రజాగొంతుక భీమదేవరపల్లి:-

రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని వంగర ఎస్సై దివ్య అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళపల్లి గ్రామంలో సోమవారం రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై దివ్య మాట్లాడుతూ, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అలాగే ఎలుకతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారిపై వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళపల్లి నుంచి రాంనగర్ వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై దివ్యతో పాటు కానిస్టేబుల్ యాదగిరి, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్