స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి (23)
కుందారం గ్రామం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట
కుందారం చెరువులో 365రోజులు నీరు ఉండే విధంగా కాలువకు తూము ఏర్పాటు చేస్తా...
రెండు పంటలకు సాగు నీరు అందిస్తా...
వారం రోజుల్లో 40ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తా...
స్మశాన వాటికకు రోడ్డు, విద్యుత్ లైన్, వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తా...
ఈ పనులన్నీ 3నెలలో పూర్తి చేయిస్తా...
కుందారం గ్రామస్తులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
కుందారం గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని అందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు..
లింగాల ఘనపూర్ మండలం కుందారం గ్రామస్తులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గ్రామంలోని సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు పలు గ్రామ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. అందులో ప్రధానంగా స్మశాన వాటిక రోడ్డు, డ్రైనేజి, సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, కమ్యూనిటీ హల్లు, విద్యుత్ దీపాలు వంటి సమస్యలను ఎమ్మెల్యే గారికి వివరించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందిస్తూ...
కుందారం గ్రామంలో మూడు ప్రధాన సమస్యలను మూడు నెలలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో మెదటిది కుందారం గ్రామ చెరువులో 365రోజులు నీరు ఉండి రెండు పంటలకు సాగు నీరు అందే విధంగా కాలువకు తూము, చెరువుకు షేటర్ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. రెండొవది స్మశాన వాటికకు రోడ్డు ఏర్పాటు తో పాటు విద్యుత్ లైన్, వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని అన్నారు. అలాగే మూడోది వారం రోజులలో 40ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని ఈ మూడు పనులను 3నెలల్లో పూర్తి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వీటితో పాటు అంగన్వాడీ భవనానికి స్థలం అందుబాటులో ఉంటే వెంటనే మంజూరు చేస్తానని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హళ్లకు 5లక్షల చొప్పున 2 కమ్యూనిటీ హళ్లకు 20లక్షలు మంజూరు చేస్తానని అన్నారు. అలాగే మరో రెండునెలల్లో కొత్త కమ్యూనిటీ హల్లతో పాటు మరో 60 ఇందిరమ్మ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్ని జరగాలి అంటే గ్రామస్తులు సహకారం ఉండాలని, కుందారం గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.
అనంతరం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పాల్గొన్నారు. లబ్ధిదారుని కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి నిర్మాణానికి అయిన వ్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకున్న లబ్ధిదారునికి, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత కుందారం గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయంలో నిర్వహించిన బీరప్ప -కామరతి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ఆలయ పూజారులు, కురుమ కులస్తులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్బంగా కుందారం గ్రామ ప్రజలపై బీరప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండే విధంగా దీవించాలని ప్రార్థించారు. భవిష్యత్ లో ఆలయ అభివృద్ధికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూకట్ల రాజు, మాజీ జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, జిల్లా బిసి సేల్ అధ్యక్షుడు ప్రవీణ్, మండల పార్టీ అధ్యక్షుడు శివ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు













