E-PAPER

అనుమానాస్పద మృతిగా భావించి పోస్టుమార్టం, గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్ లు ధృవీకరణ.

Date : 23 February 2026, 8:47 pm Posted By : PRAJA GONTHUKA

అనుమానాస్పద మృతిగా భావించి పోస్టుమార్టం, గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్ లు ధృవీకరణ.

అనుమానాస్పద మృతిగా భావించి పోస్టుమార్టం, గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్ లు ధృవీకరణ.

ప్రజా గొంతుగా (ఫిబ్రవరి 23) కాల్వ శ్రీరాంపూర్ :భార్య,కుమారుల మధ్య గొడవ వలన చనిపోయాడు అనుకోని అనుమానాస్పద మృతిగా భావించి పోస్టుమార్టం నిర్వహించిగా, మృతుడు గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్ లు తెలియజేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన తాటికొండ బాపూచారి అనే వ్యక్తి ఆదివారం రోజున పోలీస్ స్టేషన్ కు వచ్చి భార్యాభర్తల గొడవ జరిగినట్లు తెలుపుతూ,నా భార్య లత, నాపై వేడి నీరు పోసిందని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా, ఎస్సై విచారణ నిమిత్తం గ్రామానికి పోలీస్ సిబ్బందిని పంపగా, వారు స్థానికులను కుటుంబ సభ్యులను విచారించగా మద్యం మత్తులో తానే పొయ్యి పై కోడిగుడ్లు ఉడకబెడుతుండగా వేడినీరు పడినట్లు స్థానికులు తెలిపినట్లు ఎస్సై తెలిపారు. భార్యాభర్తలకు కలిసి ఉండాలని సర్ది చెప్పినట్లు తెలిపారు.అదే సాయంత్రం మళ్లీ మధ్య మత్తులో ఇంటికి వెళ్లి పడుకొనగా, కుటుంబ సభ్యులు ఎంత లేపిన లేవకపోవడంతో, చనిపోయినట్లు భావించారు. స్థానికుల, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతుని ఇంటి వద్దకు వెళ్లి చూడగా, అనుమానస్పద మృతిగా భావించి, పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి,శవ పంచనమా చేయగా,డాక్టర్ లు మృతుడు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించగా, అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అందజేసినట్లు ఏస్ ఐ తెలిపారు. ఇది ఇలాగ ఉండగా మృతుడు కులవృత్తి పనిచేస్తూ, గ్రామస్తులతో కలిగి మెలిసి ఉండేవాడని, మానవ దృక్పథంతో గ్రామస్తులు చందాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్