*రజక ఆడబిడ్డలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి - నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 23 ఫిబ్రవరి 2026.
నాగర్ కర్నూలు జిల్లా కమ్మెర గ్రామంలో రజక ఆడబిడ్డలపై జరిగిన దాడిని , రెండు నెలల పసిపాప మరణానికి కారణమైన వారిని , అమానుష సంఘటనకు కారకులైన ధనిక వర్గానికి చెందిన రెడ్డి గుండాల పైన కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని , సమాజంలో రజకుల పైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని , బాధ్యులను బహిరంగంగా ఉరితీయాలని , సమాజంలో ఉన్న రజకుల పక్షాన చెన్నారావుపేట మండల కేంద్రంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగం రమేష్ డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు మండల అధ్యక్షుల మంద నరేష్ ప్రధాన కార్యదర్శి నూనె తిలక్ , ఉపాధ్యక్షురాలు అలువాల కళ్యాణి , మండల కమిటీ సభ్యులు చందర్ తదితరులు పాల్గొన్నారు.












