ఇందిరమ్మ ఇంటికి నిర్మాణానికి భూమి పూజ.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,ఫిబ్రవరి 23:
మెదక్ జిల్లా. శివంపేట మండలం దంతాన్ పల్లి లో అర్హులైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా గ్రామంలోని లబ్ధిదారులు కుల్ల లావణ్య నరసింహులుకు మంజూరైన ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరై భూమి పూజ నిర్వహించిన గ్రామ సర్పంచ్ గజేంద్రుల మమతా నర్సింహులు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు కుల్ల సిద్ధిరాములు,కుల్ల యాదమ్మ, వెంకటేష్, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












