మృతుడి కుటుంబాన్ని పరామార్శించిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి.
ప్రజా గొంతుక చేర్యాల : జనగామ మున్సిపల్ 10వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నీరటి రజిని తండ్రి మరియు యువజన కాంగ్రెస్ జనగాం జిల్లా అధ్యక్షుడు బోనసి క్రాంతి మామ నీరటి లింగం అనారోగ్యంతో మరణించారు . విషయం తెలుసుకున్న యువనాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆదివారం మృతుడి స్వగ్రామమైన చేర్యాల మండలంలోని కడవేరుగు గ్రామంలో ఆయన భౌతికకాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రశాంత్ రెడ్డి వెంట యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందిగ రాకేష్, చేర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్,12 వ మాజీ కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్,సీనియర్ నాయకులు రాగుల శ్రీనివాస్ రెడ్డి,జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ తాటికొండ సదానందం, యువజన కాంగ్రెస్ నాయకులు అందె నాని బాబు,ఆరుట్ల వినీత్, భూమని బాలరాజు, మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












