డ్రగ్స్ రహిత సమాజం కోసం పరుగు, 'రన్ ఫర్ ఏ డ్రగ్-ఫ్రీ లైఫ్'లో పాల్గొన్న తుంగతుర్తి రవి
మేడిపల్లి మండలం
ప్రజా గొంతుక ప్రతినిధి
యువతను వ్యసనాలకు దూరం చేసి, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మళ్లించాలనే ఉద్దేశంతో 'శాంతివనం రన్నర్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన "రన్ ఫర్ ఏ డ్రగ్-ఫ్రీ లైఫ్" కార్యక్రమం ఆదివారం ఉదయం అత్యంత ఉత్సాహంగా సాగింది.
*నారపల్లి వరంగల్ హైవేలోని భాగ్యనగర్ నందనవనం పార్క్ వేదికగా జరిగిన ఈ పరుగులో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి ,మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ముఖ్య అతిదులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.*
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. "ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తోందని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని" అన్నారు. 'డ్రగ్స్ వద్దు - పుస్తకాలే ముద్దు' అనే నినాదంతో శాంతివనం రన్నర్స్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమని ఆయన కొనియాడారు. కేవలం శారీరక దృఢత్వం కోసమే కాకుండా, సామాజిక చైతన్యం కోసం నిర్వహించిన ఈ 16K, 10K, 5K మరియు 3K విభాగాల పరుగులో వందలాది మంది రన్నర్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు.
హైదరాబాద్ రన్నర్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మక్బుల్ జానీ, శ్రీకాంత్ రెడ్డి నిర్వాహకులు సోమశేఖర్, శేఖర్ మరియు స్థానిక నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.












