సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
ప్రజా గొంతుక చేర్యాల : మండల కేంద్రంలో షాది ఖానా వద్ద చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు,మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మహమ్మద్ నసీమా బేగంకు 21,000/- లు గా వీరన్న పేట గ్రామానికి చెందిన పొన్నబోయిన నరేష్ కు 20,000/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు, బలహీనవర్గాలకు అండ దండగా ఉండి ఆదుకుంటుందని ఇంకా వచ్చే రెండు నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు,షాది ముబారక్,కల్యాణ లక్ష్మ,చెక్కులు ఇచ్చి పేదలను ఆదుకుంటుందని , అంతే కాకుండా 2023 జరిగిన ఎన్నికల మెన్ ఫెస్టో లో (6 )ఆరు గ్యారంటీల అమలులో బాగంగా త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్లు ఇచ్చేందుకు ,పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ , మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సబ్ కమిటీ వేయనున్నారని ఆయన అన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావటానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీ.చామల కిరణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ కొమ్ము రాజేశ్వరి నర్సింగరావు, మహమ్మద్ షరీఫా ఖాజా, నాయకులు 11 వ వార్డ్ ఇంచార్జి గుస్క వాసంతి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కాటం మల్లేశం, శనిగారి బిక్షపతి, అంబటి అంజయ్యగౌడ్, తుమ్మలపల్లి సంతోష్ , శ్రీనివాస్, పిట్టల మహేష్, మహమ్మద్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.












