మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.
ప్రజా గొంతుక కొమురవెల్లి : మండలంలోని మర్రిముస్త్యాల గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు పిన్నింటి రవీందర్ రెడ్డి అమ్మ పిన్నింటి ఎల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న జనగామ శాసనసభ్యుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి ప్రగాఢ సానుభూతిని తెలిపి మనో ధైర్యం నింపారు. అలాగే చిలుక బాలయ్య గారి అమ్మ కూడా ఇటీవలే మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించడం జరిగింది . ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












