E-PAPER

*జవాబుదారితనంతో పనిచేస్తూ ప్రభుత్వ వ్యవస్థ పై నమ్మకం పెంచాలి*

Date : 21 February 2026, 1:27 pm Posted By : PRAJA GONTHUKA

*జవాబుదారితనంతో పనిచేస్తూ ప్రభుత్వ వ్యవస్థ పై నమ్మకం పెంచాలి*

*జవాబుదారితనంతో పనిచేస్తూ ప్రభుత్వ వ్యవస్థ పై నమ్మకం పెంచాలి*

ప్రజా గొంతుక ప్రతినిధి ఖమ్మం

*పదోన్నతి ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

*ఖమ్మం రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన పదిహేను మందికి నియామక ప్రతాలను అందజేసిన జిల్లా కలెక్టర్

విధుల పట్ల నిబద్ధతతో ఉంటూ, ప్రభుత్వ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచుతూ కొత్తగా నియమితులైన ఉద్యోగులు జవాబుదారితనంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు ఖమ్మం రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన పదిహేను మందికి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ నియమాక ప్రతాలను అందజేశారు.

ముందుగా జిల్లా రెవెన్యూ శాఖలో విధులను నిర్వహిస్తున్న పదిహేను మంది నాలుగో తరగతి, డ్రైవర్లు, రికార్డ్ అసిస్టెంట్ కేటగిరీ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించిన సందర్భంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (టి ఆర్ ఇ ఎస్ ఎ) ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ

కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న సిబ్బంది విషయ పరిజ్ఞానాన్ని, విధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని సూచించారు. నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవరుచుకొని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, ప్రజలకు త్వరితగతిన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజా సేవలో ముందుండాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోస్టింగ్ ఎక్కడ వచ్చిన మంచి పని చేస్తే గుర్తింపు వస్తుందని, ఉత్తమంగా పనిచేస్తున్న వారికి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. ఉత్తమ సేవలతో పనిచేసే శాఖకు, జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమాల అమలు చేసేందుకు బాధ్యతతో పనిచేయాలని, మీపై అధికారులతో కలిసి వృత్తి పట్ల, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ఉత్తమ సేవలతో అందరి అభిమానం‌ పొందుతూ మంచి పేరు తేచ్చుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ట్రెసా జిల్లా అధ్యక్షులు తుంబూరు సునీల్ రెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు.

కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్వయంగా అభినందించి, భవిష్యత్తుపై దిశానిర్దేశం చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. "కష్టానికి తగిన ప్రతిఫలం లభించినప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది" అన్నారు. ఒకేసారి పదిహేను మందికి పదోన్నతులు లభించడంతో జిల్లా రెవెన్యూ శాఖలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ డివిజన్ల ప్రతినిధులు, కలెక్టరేట్ యూనిట్ సభ్యులు మరియు పదోన్నతి పొందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

*జవాబుదారితనంతో పనిచేస్తూ ప్రభుత్వ వ్యవస్థ పై నమ్మకం పెంచాలి*

ప్రజా గొంతుక ప్రతినిధి ఖమ్మం

*పదోన్నతి ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

*ఖమ్మం రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన పదిహేను మందికి నియామక ప్రతాలను అందజేసిన జిల్లా కలెక్టర్

విధుల పట్ల నిబద్ధతతో ఉంటూ, ప్రభుత్వ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచుతూ కొత్తగా నియమితులైన ఉద్యోగులు జవాబుదారితనంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు ఖమ్మం రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన పదిహేను మందికి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ నియమాక ప్రతాలను అందజేశారు.

ముందుగా జిల్లా రెవెన్యూ శాఖలో విధులను నిర్వహిస్తున్న పదిహేను మంది నాలుగో తరగతి, డ్రైవర్లు, రికార్డ్ అసిస్టెంట్ కేటగిరీ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించిన సందర్భంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (టి ఆర్ ఇ ఎస్ ఎ) ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ

కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న సిబ్బంది విషయ పరిజ్ఞానాన్ని, విధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని సూచించారు. నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవరుచుకొని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, ప్రజలకు త్వరితగతిన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజా సేవలో ముందుండాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోస్టింగ్ ఎక్కడ వచ్చిన మంచి పని చేస్తే గుర్తింపు వస్తుందని, ఉత్తమంగా పనిచేస్తున్న వారికి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. ఉత్తమ సేవలతో పనిచేసే శాఖకు, జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమాల అమలు చేసేందుకు బాధ్యతతో పనిచేయాలని, మీపై అధికారులతో కలిసి వృత్తి పట్ల, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ఉత్తమ సేవలతో అందరి అభిమానం‌ పొందుతూ మంచి పేరు తేచ్చుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ట్రెసా జిల్లా అధ్యక్షులు తుంబూరు సునీల్ రెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు.

కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్వయంగా అభినందించి, భవిష్యత్తుపై దిశానిర్దేశం చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. “కష్టానికి తగిన ప్రతిఫలం లభించినప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది” అన్నారు. ఒకేసారి పదిహేను మందికి పదోన్నతులు లభించడంతో జిల్లా రెవెన్యూ శాఖలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ డివిజన్ల ప్రతినిధులు, కలెక్టరేట్ యూనిట్ సభ్యులు మరియు పదోన్నతి పొందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్