ఆపదలో ఆదుకునే నాయకుడు ఎమ్మెల్యే పల్లా....
ఎమ్మెల్యే సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత....
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
నాగిరెడ్డిపల్లి గ్రామంలో మహమ్మద్ జహంగీర్ తీవ్ర అనరోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చేరిన కారణంగా మెరుగైన చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి 2,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించి వారి కుంటుంబానికి అండగా నిలిచారు.ఈ యొక్క చెక్కుని జహంగీర్ అన్నకి రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రిరమణా రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పల్లా అండగా ఉండగా ఎలాంటి ఆపదలైన జయిస్తామని,వారు చేసిన ఈ సహాయం గొప్పదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారు రవీందర్, భారస గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల కిషన్, భారాస నాయకులు గొల్లపల్లి యాదగిరి, సలేంద్రి సోమయ్య, తాతి రెడ్డి శశిధర్ రెడ్డి, సలేంద్రి కనకయ్య, గూడెంల నరసింహులు, ఎండి అఫ్జల్, ఎండి సయ్యద్, ఎండి గోరేమియా,ఎండి ఫరీద్, మామిడాల విజేందర్, తేలు బిక్షపతి, సలేంద్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.












