జిల్లా పరిషత్ హైస్కూల్ పెద్దవూర లో పోక్సో చట్టం పై అవగాహన సదస్సు.......
ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హై కోర్టు న్యాయవాది... కట్టేబోయిన అనిల్ కుమార్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:20
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
పెద్దవూర మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా ఎంపిక కావడం జరిగింది అందులో భాగంగా మండల విద్యాధికారి తరి రాము ఆహ్వానమేరకు హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ చే మరియు స్థానిక హెడ్ కానిస్టేబుల్ ఇద్దయ్య చే విద్యార్థులకి పోక్సో చట్టంపైన అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగినది.అందులో భాగంగా అనిల్ కుమార్ విద్యార్థులకి చట్టం అంటే ఏమిటి? వివిధ చట్టాలు వాటి అవశ్యకత, బాలికలు రక్షణ కొరకు పొందుపరిచిన చట్టాల గురించి మరి ముఖ్యంగా పోక్సో చట్టం అవశ్యకత, పోక్సో చట్టం ద్వారా అమలు అవుతున్న శిక్షలు గురించి విద్యార్థులకి రీసెంట్ జడ్జిమెంట్ లతో వివరించడం జరిగినది.అనంతరం మండలం అధికారి తరి రాము మాట్లాడుతూ గత 15 సంవత్సరాలు గా అనిల్ కుమార్ నియోజకవర్గ పేద విద్యార్థులకి, నిరుద్యోగ యువత కి, పేద ప్రజలకి చేస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని వారి ద్వారా 10 సంవత్సరాల క్రితమే నియోజకవర్గంలోని ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకి మౌలిక సౌకర్యాలు కల్పించడం జరిగినది అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం ఇరువురిని శాలువ తో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తరి రాము, పాఠశాల ప్రాధానోపాద్యయులు,హెడ్ కానిస్టేబుల్ ఇద్దయ్య, హోంగార్డ్ సైదులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, నాయకులు కోట అంజి యాదవ్, మన్నెం కోటి, గంగుల లింగస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.












