ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు...
వాస్విక్ ఫౌండేషన్ బారికేడ్లు బహుకరణ....
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ నియంత్రణకు, నడుచుకుంటూ వెళ్లే ప్రజల భద్రత కోసం బారికేడ్లు ఏర్పాటు చేయించడం జరిగిందని పోచన్నపేట సర్పంచ్ ఎండి ఫిరోజ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లతో కూడిన బారికేడ్లను ఏర్పాటు చేయడానికి సహకరించిన వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆముదాల భూపాల్ రెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వారి సహకారంతో బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అడిగిన వెంటనే సహకరించినందుకు వారికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎండి ఫిరోజ్, గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు ,ఉప సర్పంచ్ ఉమేష్ చంద్ర, గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ గడ్డం అచ్చి, జూల నర్సింలు, ఆరె సతీష్, శ్రీపతి చిరంజీవి, తీగల రవి,పోతుగంటి ప్రకాష్, బుడిగి నవీన్, జైపాల్ రెడ్డి, సిద్ధార్థ, మార్క్ తదితరులు పాల్గొన్నారు.













