పోచంపల్లి బ్యాంకు బీమా చెక్కు అందజేత....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:19
ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించిన పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి చెందిన బొంగరాల వెంకటయ్య కి హలియా పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంకు హాలియా నందు భీమా సౌకర్యం కలిగి ఉన్నందున ఒక లక్ష రూపాయల చెక్కును గురువారం హలియా శాఖ నందు వారి కుటుంబ సభ్యులకు న్యాయవాది గొట్టి ముక్కల నరేష్ చేతుల మీదుగా చెక్కు అందజేయడం జరిగింది. అనంతరం బ్రాంచ్ మేనేజర్ నంద్యాల రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని తద్వారా ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు వచ్చే ప్రతిఫలం భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఖాతాదారులు , మరియు బ్యాంకు సిబ్బంది అకౌంటెంట్ రవీందర్ రెడ్డి , షాహిన్ ,భార్గవి, పవన్, , బాలు, పాల్గొన్నారు.












