E-PAPER

శ్రీ పార్వతీ బండి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు….

Date : 18 February 2026, 7:50 pm Posted By : PRAJA GONTHUKA

శ్రీ పార్వతీ బండి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు….

శ్రీ పార్వతీ బండి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు....

నల్గొండ జిల్లా ప్రతినిధి షేక్ షాకీర్ ప్రజా గొంతుక న్యూస్ పిబ్రవరి:18

నల్గొండ జిల్లా కనగల్ గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ శ్రీ పార్వతి బండి రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు "శ్రీకృష్ణ యూత్" ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బల్గూరి వెంకన్న మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ స్కూల్ వార్షికోత్సవం శివాలయం ప్రాంగణం ముందు, గ్రామస్తుల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆ తర్వాత అక్కడకు విచ్చేసిన ముఖ్యఅతిథి బెల్లి జనార్ధన్ ఎక్స్ ఆర్మీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత, దేశ సేవలో ముందుండి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. తదనంతరం గ్రామ సర్పంచ్ నర్సింగ్ మురళీధర్ మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదివానని, విద్యార్థిని విద్యార్థులు బాధ్యతతో మెలగాలని కోరారు. ఆ తర్వాత గ్రామ యువ కవి బచ్చగోని కిరణ్ యాదవ్ రాసిన "కనగల్లు చరిత్ర"...కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అతిధుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ అర్చకులు గిరి శర్మ మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని, అందరినీ ఆ పరమశివుడి ఆశీస్సులు కలగాలని దీవించారు. చిన్నారుల ఆట,పాటలతో అక్కడ జాతర వాతావరణం నెలకొని ఉంది. అక్కడికి విచ్చేసిన గ్రామ సామాజిక సేవకురాలు న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ శివ లీల కి, గ్రామ ఉపసర్పంచ్ మండలి చంద్రయ్య కి, డాక్టర్ నీలకంఠ శేఖర్ కి,అధ్యాపకులకు, అతిధులకు, విద్యార్థిని విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలను గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

⬇ DOWNLOAD
×

శ్రీ పార్వతీ బండి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు….

నల్గొండ జిల్లా ప్రతినిధి షేక్ షాకీర్ ప్రజా గొంతుక న్యూస్ పిబ్రవరి:18

నల్గొండ జిల్లా కనగల్ గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ శ్రీ పార్వతి బండి రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు “శ్రీకృష్ణ యూత్” ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బల్గూరి వెంకన్న మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ స్కూల్ వార్షికోత్సవం శివాలయం ప్రాంగణం ముందు, గ్రామస్తుల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆ తర్వాత అక్కడకు విచ్చేసిన ముఖ్యఅతిథి బెల్లి జనార్ధన్ ఎక్స్ ఆర్మీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత, దేశ సేవలో ముందుండి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. తదనంతరం గ్రామ సర్పంచ్ నర్సింగ్ మురళీధర్ మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదివానని, విద్యార్థిని విద్యార్థులు బాధ్యతతో మెలగాలని కోరారు. ఆ తర్వాత గ్రామ యువ కవి బచ్చగోని కిరణ్ యాదవ్ రాసిన “కనగల్లు చరిత్ర”…కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అతిధుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ అర్చకులు గిరి శర్మ మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని, అందరినీ ఆ పరమశివుడి ఆశీస్సులు కలగాలని దీవించారు. చిన్నారుల ఆట,పాటలతో అక్కడ జాతర వాతావరణం నెలకొని ఉంది. అక్కడికి విచ్చేసిన గ్రామ సామాజిక సేవకురాలు న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ శివ లీల కి, గ్రామ ఉపసర్పంచ్ మండలి చంద్రయ్య కి, డాక్టర్ నీలకంఠ శేఖర్ కి,అధ్యాపకులకు, అతిధులకు, విద్యార్థిని విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలను గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్