బ్రెయిన్ వ్యాధి బాధితుడికి ప్రభుత్వ సహాయం
అందజేసిన నాగపూర్ కిరణ్ కుమార్ గౌడ్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామ నిరుపేద ముదిరాజ్ సామాజిక వర్గ కుటుంబానికి 2,50,000 LOC(రెండు లక్షల యాబై వేల రూపాయల) అందజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్..జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామ నిరుపేద ముదిరాజ్ సామాజిక వర్గ కుటుంబానికి చెందిన గడ్డు బండ శ్రీను బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, స్థానిక గ్రామ సర్పంచ్ నల్ల సిద్ది నర్సమ్మ మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బాలగొని కనకయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకురాగా 2,50,000 LOC (రెండు లక్షల యాబై వేల రూపాయల)ని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సహకారముతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నల్ల మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బాలగొని కనకయ్య, జిల్లా సీనియర్ నాయకులు ఎదునూరి రవీందర్, నాయకులు బైరోగోని వెంకటయ్య, కుక్కసావు రామచంద్రం, కొన్నబోయిన నూతన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.












