ఇందిరాపార్క్ వద్ద గౌడ్ అన్నల నిరాహార దీక్ష
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరగల్ జిల్లా నెక్కొండ గౌడ సంఘ సభ్యులు కేసముద్రం ఉప్పరపల్లి గౌడ సంఘ కార్మికులు
అధ్యక్షులు తండా పెద్ద వెంకన్న ఆధ్వర్యంలో 30 మంది గీతా కార్మికులు పాల్గొన్నారు
పెద్ద ఎత్తున పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్లు కేటాయించాలి
వేలాదిమంది గీత కార్మికులతో దద్దరిల్లిన ఇందిరా పార్క్
కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు
దీనికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది గీత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
దీక్షను మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతరాములు ప్రారంభించారు
రాష్ట్ర అధ్యక్షులు యం,వి, రమణ అధ్యక్షతన నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికులకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుందన్నారు
గత సంవత్సరం బడ్జెట్లో 70 కోట్లు మాత్రమే కేటాయించారని
అవి కూడా డబ్బులు లేవనే పేరుతో విడుదల చేయలేదన్నారు
కేవలం 17 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు
ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనైనా 5 వేల కోట్లు కేటాయించి గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు
మాజీ మంత్రివర్యులు వి, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గీత కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందని పెన్షన్ 2 వేల నుండి 4 వేలకు పెంచుతామని, ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచుతామని అదికూడా నెల రోజుల లోపే ఇస్తామని చెప్పారనీ
ఇది పెంచకపోగా ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా డబ్బులు కూడా రెండు సంవత్సరాల నుండి ఇవ్వడం లేదన్నారు 850 మందికి ఇవ్వాల్సిన 14 కోట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు
రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2025 జూలై 14వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు బాధితులతో నిరాహార దీక్షలు చేశామని 2025 నవంబర్ 28వ తేదీన వేలాది మంది గీత కార్మికులతో సూర్యాపేటలో గీతన్నల రణభేరి నిర్వహించామని
అయినా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేసి హక్కులు సాధించేందుకు రాష్ట్ర కార్యవర్గం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు పూనుకుందన్నారు
బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ మాట్లాడుతూ హక్కుల కోసం పోరాటం చేయాలని, బీసీలకు రాజ్యాధికారం కై అందరం కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు
మాజీ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్
మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
సుప్రజ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్
శిగ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నిత్యం చస్తూ బతికే కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోవడం చాలా బాధాకరమన్నారు
ఈ కార్యక్రమంలో వివిధ గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు అయిలి వెంకన్న గౌడ్,
అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్,
జిక్కే వీరస్వామి గౌడ్,
వంగ సదానందం గౌడ్, మల్లేశం గౌడ్, శ్రీకాంత్ గౌడ్, కూరెల్లి వేములయ్య గౌడ్, మరియు వివిధ వృత్తి సామాజిక సంఘాల నాయకులు
దుర్గయ్య గౌడ్, నాగేశ్వరరావు గౌడ్,
ఆర్, శ్రీ రామ్ నాయక్,
టీ స్కైలాబ్ బాబు, పి,ఆశయ్య, లెల్లెల బాలకృష్ణ,
ఉడుత రవీందర్,
జి నాగరాజు తదితరులు పాల్గొని వారి మద్దతు తెలిపారు
ఈ దీక్షలో రాష్ట్ర ఉపాధ్యక్షులు
వి, వెంకట నరసయ్య, బొలగాని జయరాములు, గౌని వెంకన్న, బాల్నే వెంకట మల్లయ్య, గౌని సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శులు చౌగాని సీతారాములు, ఎస్ రమేష్ గౌడ్, ఎస్ వెంకట్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, రాగీరు కృష్ణయ్య, కొండం కరుణాకర్, మెరుగు వీరస్వామి,యమ గాని వెంకన్న, గౌరవ సలహాదారు భీమగోని చంద్రయ్య, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 105 మంది దీక్ష చేశారు
సురుగు రాజేష్ గౌడ్
రాష్ట్ర కమిటీ సభ్యులు
ఆఫీస్ సెక్రటరీ పాల్గొన్నారు












