_*ధరూర్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..*_
_*ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేక్ కటింగ్ చేసి రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ.*_
_*మాజీ జెడ్పిటిసి సభ్యురాలు పద్మ వేంకటేశ్వర రెడ్డి..*_
గద్వాల జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా గొంతుక
తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా ధరూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్తాలో కేక్ కటింగ్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యురాలు పద్మ వేంకటేశ్వర రెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు..అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ...
రాష్ట్రాన్ని సాధించినీళ్లు, కరెంటు గోస తీర్చిన నాయకుడిగా,కల్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు,కేసీఆర్ కిట్ అందించిననాయకుడు,రైతు బంధు లాంటి గొప్ప కార్యక్రమం తెచ్చి,ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇచ్చి,కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించి,వృద్దులు,వితంతువులకు ఆసరా పెన్షన్ 200/- రూపాయల నుండి 2,016/- రూపాయలు అందించి, గురుకు లాల ద్వారా పేద పిల్లలకు అద్భుతమైన విద్య అందించిన నాయకుడిగా ప్రజల గుండెల్లో కేసీఆర్ గారి చిరకాలం నిలిచి పోతారని పద్మ వేంకటేశ్వర రెడ్డి అన్నా రు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజారెడ్డి, వెంకటేష్ నాయు డు, అల్వాలపాడు ప్రతాప్,రేవులపల్లి మునిరెడ్డి,చంద్రశేఖర్, అబ్రహం, గోపాల్ రెడ్డి,జాంపల్లి రవి,పెద్దపాడు ఆంజనే యులు వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు.












