ఈ విజయం పార్టీకి ఎంతో బలం...
సంబరాల్లో పాల్గొన్న మండల ఉపాధ్యక్షుడు మట్టి బాలరాజు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలమని, కార్యకర్తలలో ఎంతో జోష్ నింపిందని బచ్చన్నపేట మండల ఉపాధ్యక్షుడు మట్టి బాలరాజు అన్నారు. జనగామ మున్సిపల్ చైర్మన్ గా కడకంచి బాలమణి శ్రీనివాస్ గెలుపొందడంతో జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి పార్టీ ఆఫీస్ వద్ద జరిగిన సంబరాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ మండల,జిల్లా స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు నిరుపేద ప్రజలకు నేరుగా అందాయని, ప్రజలు సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని విశ్వసించారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఆ దేవుడు కూడా తోడై ఈ గెలుపుని అందించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇస్మాయిల్, మండల ఉపాధ్యక్షుడు నీల రమేష్, తమ్మడపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.












