ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు...
oplus_0
కార్యకర్తలను కంటి రెప్పల కాపాడే నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు బొడిగం చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జై కేసీఆర్, జై పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమేనా అనే అనుమానాల మధ్య.. ఒక్కడంటే ఒక్కడే తెలంగాణ వస్తది, అది బంగారు తెలంగాణగా మారుతదని నమ్మాడని.. ఆ వ్యక్తే కేసీఆర్ అని అన్నారు. ఉక్కు సంకల్పం కలిగిన ఆ ఒక్కడే.. కేసీఆర్! ఉద్యమాల తెలంగాణను పదేళ్లలోనే ఉజ్వల తెలంగాణగా మార్చి, దేశానికే తలమానికంగా నిలిపిన ధీరుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. పదేండ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుండి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పాలిట వరంగా మారిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. జనగామ ప్రాంతంలో కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పల కాపాడుకునే ఏకైక నాయకుడు మా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, సిద్ధిరాం రెడ్డి, పులిగిల్ల పూర్ణచందర్, గంధ మల్ల నరేందర్, అల్వాల ఎల్లయ్య, అజీమ్,కర్నాల వేణు, గంధ మల్ల మహేష్, చింతల వెంకటయ్య, దేవరకొండ మల్లేశం, బొమ్మెన ఆంజనేయులు, మహేందర్ రెడ్డి, ఎద్దు రమేష్ తదితరులు పాల్గొన్నారు.















