E-PAPER

ఘనంగా మహాశివరాత్రి వేడుకలు 

Date : 16 February 2026, 11:52 am Posted By : PRAJA GONTHUKA

ఘనంగా మహాశివరాత్రి వేడుకలు 

ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ప్రజా గొంతుక న్యూస్,(ఫిబ్రవరి 15)సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని విద్యా నగర్ లో గల శ్రీరామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆదివారం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు.మహాశివరాత్రి సందర్భంగా పరమ శివునికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.రాత్రి లింగోద్భవ కాలం నందు మహా అభిషేకం,అర్ధరాత్రి శివపార్వతుల కళ్యాణంను వైభవంగా జరిపించనున్నారు.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ అనంతుల గణేష్ మాట్లాడుతూ మూడు రోజులపాటు మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.నేడు రుద్ర హోమం, కలశ ఉద్వాసన, బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. దేవాలయ ప్రధాన అర్చకులు రెంటాల సతీష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ, విశేషమైన అభిషేకాలు, పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు అనంతుల సందీప్, అనంతుల సూర్యనారాయణ, అనంతుల దుర్గాప్రసాద్, అనంతుల శ్రీనివాస్, పెద్దిరెడ్డి భరత్, సిహెచ్.వెంకటేశ్వర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్