-కాకతీయ పాఠశాల సంస్థల వార్షికోత్సవ పండుగలో పాల్గొన్న.
- జిల్లా విద్యాశాఖ కే విజయలక్ష్మి.
జోగులాంబ గద్వాల జిల్లా ఫిబ్రవరి 15 (ప్రజా గొంతుక ):
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో హై స్కూల్ మరియు స్మార్ట్ కిడ్స్ 16వ మరియు 12వ వార్షికోత్సవ వేడుకలో గద్వాల్ జిల్లా విద్యాశాఖ అధికారి కె.విజయలక్ష్మి టి.శ్రీనివాస్ జిహెచ్ఎంసి & ఏసి జి ఈ మరియు హంపయ్య, జిల్లా కోఆర్డినేటర్ ముఖ్య ఆకర్షణగా నిలిచారు . ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభ మై ,విద్యా ర్థులు ఈ విద్యా సంవత్సరంలో సాధించిన ప్రతిభల ఆధారంగా గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్ల మరియు మెమెంటోలను అందజేయడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమం లో ముఖ్యఘట్టమైన నృత్యాలలో మహావతార్ , ఆపరేషన్ సింధూర్ , అఖండ - 2 వంటి ఎన్నో నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షిం చాయి. ఈ వేడుకలో పాల్గొన్న తల్లి దండ్రులకు లక్కీ డిప్ ద్వారా ము ఖ్యంగా మాతృమూర్తులకు బహు మతులను అందజేయడం జరిగిం ది .అదేవిధంగావార్షికోత్సవపండుగలో పాల్గొన్న తల్లిదండ్రులకు మరియు అతిథులకు ఎంతో రుచికరమైన విందును కాకతీయ యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది.













