సిద్దేశ్వరుని దర్శించుకున్న బీర్ల ఐలయ్య...
పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జనగామ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఒకటైన కొడవటూరు సిద్దేశ్వర స్వామి ఆలయంలోమార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న తో కలిసి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి బచ్చన్నపేట వద్ద మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి అభిషేకం, రుద్రాభిషేకం, మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఐలయ్య స్వామివారి దర్శనం చేసుకొని శివలింగానికి బిల్వపత్రాలతో అర్చన చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఐలయ్యను శాలువాలతో ఘనంగా సత్కరించారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య, ఎస్ ఐ ఎస్ కే హామీద్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈవో చిదం వంశీ, సర్పంచ్ నీల కవిత మురళి,మాజీ సర్పంచ్ గిద్దల రమేష్, మాజీ డైరెక్టర్ లు నిమ్మ కరుణాకర్ రెడ్డి, , తిరుపతి రెడ్డి,రాజేష్,తదితరులు పాల్గొన్నారు.














