ద్వితీయ వార్షిక మహాశివరాత్రి మహోత్సవాలు
చౌటుప్పల్ ఫిబ్రవరి 15 (ప్రజా గొంతుక)
చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగవరం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం లో ఉన్నటువంటి ద్వితీయ వార్షిక మహాశివరాత్రి మహోత్సవములు మరియు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని దేవాలయ కమిటీ వారు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమాలు 15 .2.2026 ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు శ్రీ మహాగణపతి పూజ సాయంత్రం 6:30 కు ఏకాదశ రుద్రాభిషేకం రాత్రి 9 గంటలకు ఎదుర్కొల్లు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు సకాలంలో విచ్చేసి శివపార్తుల కళ్యాణ మహోత్సవం తిలకించి స్వామివారి కృపా కటాక్ష వీక్షణమును పొంది తీర్థప్రసాదాలు స్వికరించగలరని దేవాలయ కమిటీ అధ్యక్షులు పన్నాల రాజు రెడ్డి తెలిపారు.












