ఎంపీటీసీగా అవకాశం కల్పించండి అల్లిపూర్ రాజు.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, ఫిబ్రవరి 14:
మెదక్ జిల్లా. శివంపేట మండలం, అల్లిపూర్ గ్రామానికి చెందిన అల్లిపూర్ రాజు త్వరలో జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి అవకాశం కలిపిస్తే అల్లిపూర్ ఎంపీటీసీ బరిలో తప్పకుండా పోటీ చేస్తానని, అన్నారు. అలాగే రాజు గతంలో అల్లిపూర్ గ్రామపంచాయతీ పాలకమండలి మాజీ సభ్యులుగా కొనసాగారు.బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ, పార్టీకి విధేయుడుగా ఉంటూ, నర్సాపూర్ శాసన సభ్యురాలు వాకిటి సునితా లక్ష్మారెడ్డికి అత్యంత సన్నితుడిగా కొనసాగుతూ, అలాగే శివంపేట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులకు విధేయుడుగా ఉంటూ, పార్టీ నుండి ఎంపిటిసి గా అవకాశం కల్పించాలని అల్లిపూర్ రాజు శివంపేట మండల నాయకులను సునీత లక్ష్మారెడ్డిని కోరుతున్నారు. గతంలో నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి సహకారంతో నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి నేతృత్వంలో నర్సాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనాప్పటికీ పార్టీ పెద్దలు తనకు ఎంపీటీసీగా అవకాశం కల్పించాలని అల్లిపూర్ రాజు పార్టీ పెద్దలను కోరుచున్నారు.












