రోడ్డు ఎప్పుడు వేస్తారు మహాప్రభో
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రోడ్డు ఎప్పుడు వేస్తారు మహాప్రభో చర్ల బస్టాండ్ నుండి కాలేజీ వరకు ఈ రోడ్డును ఎప్పుడు వేస్తారు మహాప్రభో అని చర్ల బిఆర్ యస్ పార్టీ మండల తమ కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్ చేశారు ఈ రోడ్డు కోసం గతంలో రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగింది అయిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కాని పట్టించుకునే నాథుడే లేడు ఈ రోడ్డు 2025 జనవరిలో 1కోటి10 లక్షల రూపాయలు మంజూరు చేశారు పంచాయతీ ఎన్నికలకు ముందు అడవుడిగా ఎమ్మెల్యే ఆగస్టు లో శంఖుస్తాపన చేసారు ఈ రోడ్డు మంజూరు అయి 2 వ సంవత్సరం అడుగు పెట్టిన ఈ రోడ్డు వేయించాలని ఆలోచన మర్చి పోయారు ఈ రోడ్డు మీద అనేక గిరిజన గ్రామాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు కాలేజీ విద్యార్థులు దేవాలయలకు వెళ్లే ప్రజలు లక్ష్మికాలని దేవనగరం దోసిల్లపల్లి పెద్దమిడిసిలేరు తిప్పాపురం గ్రామస్తులు ప్రయాణం చేస్తున్నారు అనేక గోతులతో పాడై ఉండుట వలన టూ వీలర్స పై ప్రయాణం చేసేవారు పడిపోతున్నారు దీనికి తోడు గ్రావెల్ తోలే లారీల వలన ఉన్న రోడ్డు పాడైపోతుంది అక్కడ ప్రజలకు రాత్రులు నిద్ర పట్టడం లేదుఅని ఈ బాధలు ఏంటి అని ప్రజలు గోల పెడుతున్నరు ఇప్పటికే భధాచలం నుండి చర్లప్రయాణంలో లారీల వలన గోతుల వలన దుమ్ము దూళీతో నిండి పోయింది అభివృద్ధి జరకపోయిన రోగాలు దగ్గు గొంతు ఇన్ఫెక్షన్ బాగ అభివృద్ధి చెందాయి అనేక రోడ్డు ప్రమాదాలు గత 4 రోజుల క్రితం గోతుల వలన లక్ష్మినగరం వద్దు లారీ కింద పడి ఒక మహిళ మృతి చెందింది ఆదివారం రాత్రి శివరాత్రి సందర్భంగా గిరిజన గ్రామాల నుండి వేలమంది తేగడ చర్ల దేవాలయాలను సందర్శించడం జరుగుతుంది ఈ గోతుల వలన లారీల వలన ప్రమాదాలు జరగవచ్చు ఇకనైనా ఈ రోడ్డు వేయించి భద్రాచలం నుంచి చర్ల వరకు గోతులు పూడ్చండి లేనియెడల మరోసారి బిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము.












