నిరుపేద విద్యార్థులకు సైకిల్స్, దుస్తులు పంపిణీ
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా
పెద్దది కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసురు మండల పరిధిలోని భీమవరం సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్లంపేట చిన్న ఊట్లపల్లి, భీమవరం గ్రామాలకు చెందిన నిరుపేద ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇ 81సి.ఆర్.పి.ఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి 81 బెటాలియన్ కామాండెంట్ శ్రీ ముఖేష్ కుమార్ సింగ్, సెకండ్ ఇన్ కమాండెంట్ దేవేంద్ర సింగ్ కేశవ్, కోబ్రా బెటాలియన్ 206, సెకండ్ ఇన్ కమాండెంట్ 81 బెటాలియన్ హిమానుష్ ప్రసాద్, డాక్టర్ దామోదర్ సింగ్ ఈ 81 బెటాలియన్ శ్రీధర్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూడు గ్రామాల ఆదివాసీల విద్యార్థులకు లాటరీ పద్ధతిలో 25 మందికి సెకండ్ ఇన్ కమాండెంట్ హిమానిష్ ప్రసాద్ చేతుల మీదుగా ఆదివాసీ విద్యార్థులకు సైకిళ్లు, మందులు,దుస్తులు అందజేశారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసీలందరికీ డాక్టర్ దామోదర్ సింగ్ ఆధ్వర్యంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సెకండ్ ఇన్ కమాండెంట్ కమాండెంట్ హిమానుష్ ప్రసాద్ మాట్లాడుతూ భీమారం గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేసి సంవత్సరం గడుస్తుంది. క్యాంప్ ఏర్పాటు చేయకముందుఈ గ్రామాల్లో విద్యుత్ గాని, రోడ్లు గాని మంచినీరు సదుపాయాలు లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. క్యాంపులు ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకురోడ్డు,మంచినీరు విద్యుత్తు వంటి సదుపాయాలు కల్పించిందన్నారు.సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో గ్రామాల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు అందించామని, అలాగే గ్రామంలోని కొంతమందికి సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందని . గ్రామాల్లోని యువత కోసం డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు తయారు చేసే యంత్రాలను త్వరలో అందించనున్నామని తెలిపారు. అలాగే గ్రామాల్లోని రైతులుకు పుట్టగొడుగుల పెంపకం పై అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు వినియోగించుకోవాలని తెలిపారు.












