*-డాక్టర్ నందినిసిధారెడ్డి సాహిత్య సమాలోచన సదస్సులో...*
*-పత్రసమర్పణ చేసిన బసవరాజప్ప.*
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, (మహేం ద్రహిల్స్) ఘాట్ కేసర్ హైదరాబాద్, మరియు తెలంగాణ ఉన్నత మండలి, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యం, తెలుగుభాష చైతన్య
సమితి, సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ తోలి చైర్మన్, డాక్టర్ నందినిసిధారెడ్డి సాహిత్య సమాలోచన అనే రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు లో భాగంగా రెండో రోజు డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అధ్యక్షతనలో జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండల కేంద్రానికి చెందిన బసవరా జప్ప అధ్యాపకులు ప్రభుత్వ ఉపాధ్యా య విద్యా కళాశాల మహబూబ్ నగర్ వారినందినిసిధారెడ్డిసాహిత్యం-మేలుకొలుపుఅనేఅంశంపైపత్రసమర్పణ చేయడం జరిగింది. నందిని సిధారెడ్డి సాహిత్యం నేటి సమాజానికి, వ్యకులకు, రాబోయే కాలానికి మేలుకొలుపు అని తెలియజే సినందుకు నిర్వాహకులు అభినందిస్తూ ప్రశంసాపత్రం, శాలువాతో సన్మానం చేయడం జరిగింది ఈ. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ తోలి చైర్మన్ గౌరవ శ్రీ డాక్టర్ నందిని సిధారెడ్డి, తెలంగాణ భాషా చైతన్య సమితి అధ్యక్షుడు బడేషాబ్, సదస్సు గౌరవ సంచాలకులు,డాక్టర్ వి.జయప్రకాస్, గౌరవ సంచాలకులు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. స్నేహలత, తెలుగు శాఖ అధ్యక్షులు సదస్సు సంచాలకులు డాక్టర్ శ్రీభాష్యం అనూరాధా, సహా సంచాలకు లు తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ లక్ష్మిఅసిరెడ్డి, గంట మనోహర్ రెడ్డి, నాళేశ్వరంశంకర్ మరియు అధ్యాప కులు, రచయితలు, సాహిత్య వేత్తలు పాల్గొన్నారు.












