E-PAPER

చాణక్య వ్యూహంతో గెలిపించిన సర్పంచ్ ఎండి ఫిరోజ్ 

Date : 13 February 2026, 2:17 pm Posted By : PRAJA GONTHUKA

చాణక్య వ్యూహంతో గెలిపించిన సర్పంచ్ ఎండి ఫిరోజ్ 

చాణక్య వ్యూహంతో గెలిపించిన సర్పంచ్ ఎండి ఫిరోజ్ 

28వ వార్డు అభ్యర్థి రికార్డ్ స్థాయిలో భారీ మెజార్టీతో గెలుపు....

ప్రజా గొంతుక జనగామ మున్సిపాలిటీ

జనగామ మున్సిపాలిటీలో 28వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఫాతిమా సమద్ గెలుపు కోసం వార్డు ఇంచార్జ్, బచ్చన్నపేట సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి పీరోజ్ కీలకపాత్ర పోషించారు. క్లస్టర్ ఇంచార్జిగా ఉన్న మాజీ సర్పంచుల పోరం అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి తనకు ఇచ్చిన క్లస్టర్ 13, 28 ,29లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి విజయ డంక మోగించారు. తమకు ఇచ్చిన బాధ్యతను నిర్వహించడంలో తమ బాధ్యతగా తీసుకొని కౌన్సిలర్ గా గెలిపించడం ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కానుకగా అందించడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఫిరోజ్ అన్నారు. 521 మెజార్టీతో రికార్డు స్థాయిలో విజయం సాధించడం ఎంతో గొప్ప అని అన్నారు.చాణక్య వ్యూహంతో విజయం సాధించడం తమకు ఏ బాధ్యత అప్పగించిన పార్టీ బలోపేతానికి కృషి చేయడంలో తమ పేరును నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా సమద్ ను శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోచన్నపేట నాయకులు జూకంటి కిష్టయ్య, కంసాని జైపాల్ రెడ్డి ,ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×
  • చాణక్య వ్యూహంతో గెలిపించిన సర్పంచ్ ఎండి ఫిరోజ్ 
  • 28వ వార్డు అభ్యర్థి రికార్డ్ స్థాయిలో భారీ మెజార్టీతో గెలుపు….

ప్రజా గొంతుక జనగామ మున్సిపాలిటీ

జనగామ మున్సిపాలిటీలో 28వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఫాతిమా సమద్ గెలుపు కోసం వార్డు ఇంచార్జ్, బచ్చన్నపేట సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి పీరోజ్ కీలకపాత్ర పోషించారు. క్లస్టర్ ఇంచార్జిగా ఉన్న మాజీ సర్పంచుల పోరం అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి తనకు ఇచ్చిన క్లస్టర్ 13, 28 ,29లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి విజయ డంక మోగించారు. తమకు ఇచ్చిన బాధ్యతను నిర్వహించడంలో తమ బాధ్యతగా తీసుకొని కౌన్సిలర్ గా గెలిపించడం ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కానుకగా అందించడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఫిరోజ్ అన్నారు. 521 మెజార్టీతో రికార్డు స్థాయిలో విజయం సాధించడం ఎంతో గొప్ప అని అన్నారు.చాణక్య వ్యూహంతో విజయం సాధించడం తమకు ఏ బాధ్యత అప్పగించిన పార్టీ బలోపేతానికి కృషి చేయడంలో తమ పేరును నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా సమద్ ను శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోచన్నపేట నాయకులు జూకంటి కిష్టయ్య, కంసాని జైపాల్ రెడ్డి ,ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్