దేశవ్యాప్తంగా సమ్మెకు భారీగా తరలివచ్చిన కార్మికులు.. సల్ల నరసింహ యాదవ్
మేడిపల్లి మండలం
ప్రజా గొంతుక ప్రతినిధి
మేడిపల్లి మండలం సిఐటియు అధ్యక్షులు ,భవన నిర్మాణ కార్మిక శాఖ బోడుప్పల్ డివిజన్ అధ్యక్షులు, దేవేందర్ నగర్ కాలనీ పేస్టు మాజీ అధ్యక్షులు సల్లనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని కోరుతూ సమ్మెను భారీ కార్యకర్తలతో జండా ఊపి ప్రారంభించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉప్పల్ ,మేడిపల్లి, రామంతపూర్ డివిజన్లోని కంపెనీలు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ జిల్లా సిఐటియు జనరల్ సెక్రటరీ వెంకన్న విచ్చేయడం జరిగినది. ఈ సందర్భంగా కార్మికుల నిర్దేశించి వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండిగా కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి ఇది రద్దు అయ్యేంతవరకు దేశవ్యాప్తంగా మరోసారి ఉద్యమం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. అనంతరం మేడిపల్లి మండలం సిఐటియు అధ్యక్షులు సల్ల నరసింహ యాదవ్ ముఖ్యంగా ఆటో కార్మికులు గానీ, కంపెనీలో చేసే కార్మికులు గాని, రోజురోజుకు వారి పరిస్థితి దయనింగా తయారైంది. ఈ సమస్య నుండి కార్మికులు గట్టెక్కాలంటే ప్రతి కార్మికుడికి విధిగా వేతనంగా ఇప్పుడు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ప్రతిరోజు సుమారుగా 1000 రూపాయలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే ఏదైనా అనుకోని పరిస్థితి ఏర్పడి పని చేయలేని పక్షంలో కార్మికుడికి విధిగా కొంత డబ్బు ఇచ్చి వారి కుటుంబానికి భరోసా కల్పించవలసిన అవసరం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించాలి. అలాగే ప్రతి కార్మికుడికి 100% జీవిత బీమా కంపెనీ భరించే విధంగా సంస్కరణలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం మొండిగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు వల్ల బడుగు, బలహీన వర్గాల జీవితాలు మెడకు ఉరితాడే బిగిస్తున్నట్లు ఉంది. అందుకే ఈ నాలుగు లేబర్ కార్డులను వెంటనే రద్దు చేయాలి అని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మికులందరూ ముక్తకంఠంతో ఖండించడం జరిగినది. ఒకవేళ ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ధర్నాలు రాస్తా రోకు లతో కేంద్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండలం జిల్లా సహాయ కార్యదర్శి ఎడవెల్లివేణు, సలహాదారు బాల్య మల్లయ్య, నన్న బోతు ప్రశాంత్,మంగ హరీష్, మీనయ్య ,చంద్రయ్య,వాసూరి భాస్కర్,పాము భాస్కర్, కూరాకుల రాజు, సారంగ సతీష్,నాగరాజు ముత్యాల సత్తయ్య, బబ్లు ,కుంట కొమురయ్య తదితరులు పాల్గొనడం జరిగినది












