దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం.
-ఐఎఫ్టియు, జిల్లా ప్రధాన కార్యదర్శి. జమ్మిచేడు కార్తీక్.
గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర సమ్మె కార్యక్రమం పాల్గొని,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అనుసరి స్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఈ సమ్మె జరుగుతుందని సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొన్నారు బిజెపి అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేయాలని కోరారు. కార్మిక వ్యతిరే క నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉత్పత్తి చేసిన సంపద శ్రమజీవులకే దక్కాలని, సంపదను వికేంద్రీకరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఆపాలని, కాం ట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ను రద్దుచేసి ప్రతి ఒక్క కార్మికుని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని, అంతవరకు కనీస వేతనం 26,0 00 అమలు చేయాలని, పెరుగు తున్న నిత్యవసర వస్తువుల ధర లు తగ్గించాలని, కార్మికులు ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలని, విత్తన విద్యుత్ బిల్లులకు సవరణలు ఆపాలని, తదితర అనేక డిమాం డ్లతో ఈ దేశవ్యాప్త సార్వత్రిక స మ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన గత 12 సంవత్సరాల కాలంలో పెట్టు బడిదారులు కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చే స్తూ, పేద మధ్య తరగతి, కార్మికు లకు వ్యతిరేకమైన విధానాల అనుసరిస్తున్నదని తెలిపారు. కార్మికులకు భద్రత కల్పించకుండా, సంక్షేమాలు అమలు చేయకుండా నిర్బంధ నియంతృత్వ దౌర్జన్య పూరిత విధానాలతో శ్రమ దోపిడిని నిరాటంకంగా కొనసాగించడానికి చేస్తున్న విధానాలకు వ్యతిరే కంగానే ఈ సమ్మెను నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. సమ్మెలో పాల్గొ న్న ప్రతి ఒక్క కార్మికులకు ధన్యవా దాలు తెలిపారు.












