E-PAPER

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి 

Date : 12 February 2026, 11:44 am Posted By : PRAJA GONTHUKA

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి 

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వరికుప్పల వెంకన్న పిలుపు

ప్రజా గొంతుక న్యూస్, సూర్యాపేట:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్నది. మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం- 2025, వీబీజి-రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్బీసీలో 100శాతం విదేశీ పెట్టుబుడలకు అనుమతించడం లాంటి ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 12న జరుప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దత్తును ఇస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వరికుప్పల వెంకన్న పిలుపు పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని కార్మికులు, ప్రజలు ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు లాభం చేకూర్చేలా ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను తెచ్చింది. వీటి వల్ల కార్మికులు ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సామాజిక భద్రతకు దూరమవుతారు. ఉద్యోగ భద్రత వుండదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కార్మికుల పనిగంటలు పెంచుతూ చట్ట సవరణ జరిగింది. వీబీజి-రామ్ జీ చట్టం తెచ్చి కేంద్రం తన బాధ్యతల నుండి తప్పుకుంటున్నది. బడ్జెట్లో కేటాయింపులు తగ్గింపు, పని రోజులు తగిస్తోంది. విద్యుత్ సవరణ బిల్లు వల్ల సామాన్యులకు విద్యుత్ చార్జీలు పెరుగుతాయి. స్మార్ట్ మీటర్లు, క్రాస్ సబ్సిడీ రద్దుతో రైతులు, పేదలకిచ్చే ఉచిత , సబ్సిడీ విద్యుత్ ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రాల హక్కులను హరిస్తుంది. ఇది ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. విద్యుత్ ఛార్జీలు కీలక విషయాల నిర్ణయాల్లో రాష్ట్రాల అధికారాలు తగ్గించి తన పట్టును పెంచుకుంటుంది. విత్తన సవరణ బిల్లు వల్ల విత్తనాల ధరలను నియంత్రించే అధికారం ప్రయివేటు కంపెనీల చేతుల్లోకి వెళ్ళి, బహుళజాతి కంపెనీల పట్టు పెరుగుతుంది. దీంతో సాగు ఖర్చు భారీగా పెరుగుతుంది. ఎలసిలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వల్ల విదేశీ కంపెనీలు కేవలం లాభాపేక్షతో పని చేస్తాయి. క్లెయిమ్ల విషయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. ప్రజల సొమ్మును మన దేశ అభివృద్ధికి కాకుండా విదేశీ కంపెనీల లాభాలకు మళ్ళిస్తారు.

తమ డిమాండ్ల సాధనకోసం కార్మికులు, రైతు, వ్యవసాయ కార్మికు సంఘాలు మద్దతు ప్రకటించాయని తెలిపారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్