"మెపా"మండల అధ్యక్షుడిగా చింతల పరుశురాములు నియామకం.
ప్రజా గొంతుక చేర్యాల : మండల కేంద్రంలోని MEPA మెపా అధ్యక్షుడిగా చింతల పరుశురాములు ముదిరాజ్ ను ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ నియమిస్తూ "మెపా" వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మంగళవారం రోజున నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా చింతల పరశురాములు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు పిట్ల ఆంజనేయులు,ప్రధాన కార్యదర్శి నాయిని కృష్ణ లకు కృతజ్ఞతలు తెలిపి, సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పరుశురాములుమాట్లాడుతూ మండలంలో ముదిరాజ్ ల ఐక్యత కొరకు కృషి చేస్తామని,ఈ ప్రభుత్వం పై రిజర్వేషన్ కోసం ఒత్తిడి చేస్తామని అన్నారు.












