ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించుకోవాలి.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ పెరుమాళ్ రష్మీ
ప్రజా గొంతుక చేర్యాల : వాతావరణంలోఎన్నికలునిర్వహించుకోవాలని, ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు తప్పు అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ పెరుమాళ్ రష్మీ సూచించారు. మంగళవారం రోజున చేర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ బందోబస్తునిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటర్లను యువకులను పోలీస్ శాఖ ఎవరిని కూడా ఇబ్బందులకు గురిచేయవద్దని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉండాలన్నారు.ఈకార్యక్రమంలో చేర్యాల సిఐ బానోతు రమేష్ నాయక్, చేర్యాల ఎస్సై వేముల నవీన్, కొమురవెల్లి ఎస్సై తోట మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.












